సొంతం హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..

తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని.. ఎప్పటికీ గుర్తుండిపోయిన ప్రేమ కథ సినిమాలలో సొంతం మూవీ ఒకటి. ఈ సినిమాలో సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి. శ్రీ‌నువైట్ల‌ డైరెక్ష‌న్‌లో ఆర్యన్ రాజేష్, రోహిత్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ సినిమా మంచి స‌క్స‌స్ అందుకుంది. ఇందులో నమిత హీరోయిన్గా కనిపించింది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా.. అప్పట్లో మ్యూజిక్ ప‌రంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఎక్కడో చోటా.. ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నేహ పెండ్సే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

నేహ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అందం, అభినయం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో సౌమ్య పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాలో.. రోహిత్ ప్రేయసిగా నేహా కనిపించింది. అయితే అప్పటికి ఈ అమ్మడి వయసు 17 సంవత్సరాలు కావడం విశేషం. తర్వాత మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో ఆకట్టుకుంది. కానీ తెలుగులో మాత్రం సరైన అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌కు దూరమైన ఈ అమ్మడు.. కొంతకాలానికి వివాహం చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

Nehha Pendse | Thank u ITA awards. U were splendid. Styled and customised  @kansalsunakshi Necklace- @gehnajewellers1 Ring - @rubans.in Asisted... |  Instagram

2020లో ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న నేహా.. మళ్లీ వెండితెరపై కనిపించలేదు. అయితే అప్పుడప్పుడు సీరియల్స్ లో మాత్రం మెరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న నేహా.. తాజాగా తన గ్లామరస్‌ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్స్ అంతా.. ఈమె నిజంగా అమాయకత్వంతో ఆక‌ట్టుకున్న‌ సొంతం హీరోయినేనా.. ఇంత హాట్‌గా కనిపిస్తుంది అంటూ.. తన గ్లామర్ తో సెగ‌లు రేపుతుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Nehha Pendse | Thank u ITA awards. U were splendid. Styled and customised  @kansalsunakshi Necklace- @gehnajewellers1 Ring - @rubans.in Asisted... |  InstagramNehha Pendse | Thank u ITA awards. U were splendid. Styled and customised  @kansalsunakshi Necklace- @gehnajewellers1 Ring - @rubans.in Asisted... |  Instagram