NBK111కు కాంబినేషన్ ఫిక్స్.. మరోసారి ఆ డైరెక్టర్ తో బాలయ్య..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గతంలో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటితో అఖండ సీక్వెల్ గా అఖండ‌ తాండవం సినిమాలో బాలయ్య నటించ‌నున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్బికె 111 కాంబినేషన్ కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా కథ విషయంలో ఒప్పందం కుదిరిపోయిందట.

NBK 109 Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer, Story, Box  Office Collection – Filmibeat

బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా.. బాలకృష్ణకు భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ 76 లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ చివరిలోగా పూర్తి చేసి ఫ్రీ అవుతాడట. ప్రమోషన్స్ కోసం మరో నెల రోజులు అయిపోయిన ఫిబ్రవరి నుంచి బాలయ్య స్క్రిప్ట్ పనులు మొదలవుతాయ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య 109లో బిజీగా ఉన్నారు.

NBK108: Balakrishna shooting his intro scenes for the Anil Ravipudi biggie

దీని తర్వాత బాలయ్య అఖండ తాండవం ఈ ఏడాది చివరికి పూర్తి చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బోయపాటి సినిమా ఆలస్యం చేస్తే.. 2026 సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కావచ్చు. ఇక ప్రస్తుతం బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో బాలయ్య నటించినున్నాడట. అయితే ఈ సినిమాల తర్వాత మరో ఏ సినిమాలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉన్న సంగతి తెలిసిందే డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సినిమాలో బాలయ్య ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నాడని టాక్.