ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్కూల్ టాపర్‌ని గుర్తుపట్టారా.? ఈ అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. నార్త్‌లోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట ఐఏఎస్ ఆఫీసర్ కావాలని భావించిందట. కానీ ఫేట్ ఆమెను హీరోయిన్ గా మార్చింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. సర్లే మేమే చెప్పేస్తాం. ఆమె ఎవరో కాదు స్టార్ట్ బ్యూటీ రాశి కన్నా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను దక్కించుకుంది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఉన్న రాశి కన్నా తన ఇంటర్ నుంచే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బిజీ అయింది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ మద్రాస్ కాఫీలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత తొలిప్రేమ, సుప్రీం, జైలవ కుశ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ పాత్రలోనే కాదు.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ కామెడీ, ఎమోషన్స్, రోమ్యాన్స్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇక చాలాకాలంగా సోషల్ మీడియా వేదికగా త్రో బ్యాక్ థీం తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీస్ తమ చిన్ననాటి ఫోటోలను, జ్ఞాపకాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాసి కన్నా తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చైల్డ్‌హుడ్ ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది.
అలా తన స్కూల్ టాపర్ గా వచ్చిన క్రమంలో దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఆ పిక్ అప్పటిదే. చిన్నతనంలో చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న రాశి కన్నా.. స్కూల్ టాపర్ గా ఉండేదట. అంతేకాదు తను ఐఏఎస్ కావాలని ఎన్నో కలలు కనింది. కానీ.. ఈ క్రమంలోనే నటనపై ఆసక్తి పెరగడంతో.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు నటించకపోయినా.. తమిళ్లో పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోను అడుగుపెట్టి హిందీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది.