టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా నంబర్ వన్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ను అభిమానులు డార్లింగ్.. అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా దాదాపు అందరినీ డార్లింగ్ అనే పిలుస్తారు.. ఊత పదం కూడా అదే. కానీ ప్రభాస్ ఒకే ఒక హీరోని మాత్రం బావ అని పిలుస్తాడట. అది కూడా ఓ సీనియర్ హీరోని అలా పిలుస్తాడని చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ హీరో ని మాత్రమే అంత స్పెషల్ గా పిలవడానికి అసలు కారణమేమిటో.. ఒకసారి తెలుసుకుందాం.
ఆ సీనియర్ హీరో మారెవరో కాదు మోహన్ బాబు. మోహన్ బాబుతో కలిసి ప్రభాస్ బుజ్జిగాడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బుజ్జి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పెద్దయ్యక కూడా ఆమె తననే ఇష్టపడాలని ప్రభాస్ కోరుకుంటాడు. తనే హీరోయిన్ త్రిష. ఇక త్రిష తన లవర్ అని తెలుసుకున్న ప్రభాస్ ఆమెను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక సినిమాలో త్రిష అన్నగా నటించిన మోహన్ బాబు బావనే అవుతాడు కదా.. అలా మోహన్ బాబుని బావ బావ అని పిలవడం ప్రాక్టీస్ చేసిన ప్రభాస్.. రియల్ లైఫ్ లోను బావ అని పిలవడం మొదలుపెట్టాడట. అప్పటి నుంచి ఇప్పటికి మోహన్ బాబుని ప్రభాస్ బావ అనే పిలుస్తాడని స్వయంగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి వివరించారు.
ఓ టీవీ షోలో మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న క్రమంలో.. ప్రభాస్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను గుర్తు చేసుకుంది. అలా ఇప్పటికీ మోహన్ బాబును ప్రభాస్ బావ అని పిలవడానికి.. హీరొయిన్‌గా నటించిన త్రిష కూడా ఒక కారణం. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోగా వరుస సినిమాలను లైన్లో పెట్టుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. కన్నప్ప సినిమాకు తానే అన్ని అయ్యి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తు.. దర్శకత్వ పరంగాను పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాలో మహదేవ శాస్త్రి రోల్‌ను ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఓ కి రోల్లో కనిపించనున్నాడు.