హీరోయిన్ అదితీరావ్ హైదారి తాత ఎవరో తెలుసా.. అమ్మడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి..

స్టార్ హీరోయిన్ అదితీ రావ్ హైదరికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ బ్యూటీగా కొనసాగుతున్న అదితి రావ్‌.. నేడు(28 అక్టోబ‌ర్) బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా అమ్మడికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట‌ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే అదితి రావ్‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. టాలీవుడ్‌లో మరే హీరోయిన్‌కు లేని రేంజ్‌లో అమ్మ‌డి బ్యాగ్రౌండ్ ఉంటుందనటంలో సందేహం లేదు. ఈమె తాతలు ఇద్దరు తోపులే. తాతా అక్బర్ హైదారి(తండ్రి నాన్న‌).. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఇక తల్లి నాన్న‌ రామేశ్వరరావు తెలంగాణ వనపర్తి సంస్థాన‌దీశుడిగా రాణించారు. ఇలా రాజుల వంశానికి చెందిన అదితి 1986లో హైదరాబాద్‌లో జన్మించింది. ఇక రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో.. తల్లితో కలిసి ఢిల్లీలోనే హైదరి పెరిగింది.

ఇక అమీర్ ఖాన్ మాజీ భార్య డైరెక్టర్ కిరణ్ రావు కూడా ఈమెకు బంధువే కావడం విశేషం. 2006లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రాణిస్తుంది. సమ్మోహనం, అంతరిక్షం, వి, మహాసముద్రం సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అదితి మహాసముద్రం షూటింగ్ టైంలో హీరో సిద్ధార్థ్‌ను ప్రేమించి ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఈమె బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిస్రాని తన 17 ఏళ్ల వయసులోనే ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆరేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు.