చైతన్య – శోభిత పెళ్లి ముహూర్తం పిక్స్.. సమంతతో ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా తుడిచేసిన చైతు..

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో తన కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేసిన చైతన్య.. ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక తాజాగా శోభిత తన ఇంట్లో పెళ్లి పనులను మొదలు పెట్టి.. పసుపు దంచుడు ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ ఏడది డిసెంబర్‌లోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారట.

ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఈ లవ్ బర్డ్స్. కాగా.. సమంతతో విడాకుల తర్వాత ఆమెతో ఉన్న జ్ఞాపకాలు అన్ని తుడిచేసిన చైతన్య.. తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని డిలీట్ చేశాడు. కానీ.. ఒక పోస్ట్ మాత్రం అలాగే వదిలేసాడు. అందులో సమంతతో విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు.. 2018లో మజిలీకి సంబంధించిన పోస్టర్.. అలాగే రేస్ ట్రాక్లో సమంతతో కలిసి దిగిన ఫోటో ఉన్నాయి.

Majili movie review: Naga Chaitanya delivers career-best performance, ably  supported by Samantha – Firstpost

ఇక ఈ ఫోటోలకు బ్యాక్ త్రో మిసెస్.. అండ్ ది గర్ల్ ఫ్రెండ్ అనే క్యాప్షన్ ఇచ్చి.. నాగ చైతన్య అప్పట్లో పోస్ట్‌ను షేర్ చేసాడు. తాజాగా ఈ ఫోటోని చూసిన సమంత ఫ్యాన్స్.. తన అకౌంట్‌నుంచి ఆ పోస్ట్ ని తొలగించాలని.. శోభితతో ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడం అస్సలు బాలేదంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట‌. ఈ క్రమంలో నాగచైతన్య ఆ పోస్టును కూడా తొలగించినట్లు టాక్.