బ‌న్నీ పుష్పరాజ్ రూలింగ్.. టాలీవుడ్‌ ఆల్ టైం రికార్డ్..

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తర్కెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా మోస్ట్టెఅవ‌యిటెడ్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాను.. భారత ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు పుష్పాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మరింత ఆశ‌క్తిని నెలకొల్పాయి.

Pushpa 2: The Rule Set for Massive Release Across India

రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ నెటింట‌ ఎలాంటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ ప్రెస్‌మిట్‌లో నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో ఏకంగా 1,150 స్క్రీన్‌ల‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇండియాలో 6,500 స్క్రీన్లు, ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్ లపై గ్రాండ్గా పుష్ప2ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

Pushpa 2 is already a blockbuster: How the Allu Arjun starrer made over Rs  1000 crore months before release - The Economic Times

ఈ క్రమంలోనే ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమా అంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాను కూడా ఇన్ని స్క్రీన్లలో షోలు వేసింది లేదని.. పుష్ప 2కి మాత్రమే మొదట ఈ ఘనత దక్కిందంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. పుష్ప 2 రిలీజై.. ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. ఇక పుష్ప 2 కలెక్షన్ పరంగా సంచలనాలు సృష్టించడం.. మరిన్ని స‌రికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.