ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. తల్లైనా తరగని అందం.. 42 ఏళ్ల వయసులోనూ ..

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. క్షణాల్లో నెట్టింటి వైరల్ గా మారుతుంది. అంతేకాదు వారికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ నుంచి వారు వాడే లగ్జరీ కార్ ఇల్లు వరకు వారి చిన్నప్పటి ఫొటోస్ కూడా నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పటికీ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ. 42 ఏళ్ళ వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Shriya Saran : Age, Height, Career, Movies, Net Worth

బిడ్డకు జన్మనిచ్చి.. తల్లైనా ఇప్పటికీ తన హాట్ నెస్ తో కుర్రకారుకు చెమటలు పట్టేస్తుంది. ఇంతకీ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు హీరోయిన్ శ్రియ శరన్. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య , నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఎంతో మంది అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. 1981లో డెహ్రాడూన్ లో పుట్టింది. చిన్న‌ప్పుడే కథక్‌, రాజస్థానీ నృత్యాలను నేర్చుకున్న శ్రేయ.. సినిమాల్లోకి రాకముందు కాలేజీ సమయంలోనే షార్ట్ ఫిలిం లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 2001లో విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇష్టం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది.

Shriya Saran, Andrei Koscheev's family moments

తర్వాత తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. తెలుగు యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు దాదాపు అందరితో నటించిన శ్రీయ.. 2003లో జ్యోతి కృష్ణ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఓ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి దాదాపు కోలీవుడ్ అగ్ర హీరోల అందరితోను నటించి అక్కడి ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. ఇక 2018లో రష్యాకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ యాండ్రి కోశ్లేను పెళ్లి చేసుకుని సినిమాలకు దూర‌మైంది. వీరికి రాధ అనే కూతురు కూడా ఉంది. అయితే సినిమాలకు దూరమైన శ్రేయ ప్రస్తుతం పూర్తిగా మోడలింగ్ రంగంలో రాణిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో కుర్ర కారకు ట్రీట్ ఇస్తూ.. ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది.

Shriya Saran looks amazing in her recent pics | cinejosh.com