ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ హీరోగా సినిమాలు చేయడంతో హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్లు వ్యాపారం జరుగుతుండేది. అప్పట్లో పవన్, ఎన్టీఆర్, బన్నీ , చరణ్‌లు పాన్ ఇండియా స్కేల్‌లో ఇంకా సినిమాలను ప్రారంభించలేదు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా రిలీజ్ కాలేదు. ఇక బన్నీ విషయానికి వస్తే మూడేళ్ల క్రితం ఎప్పుడో పుష్ప రిలీజై బ్లాక్‌బస్టర్ తెచ్చుకుంది. తర్వాత నుంచి పుష్ప 2 షూటింగ్ జరుగుతూనే ఉంది. చరణ్ కూడా అంతే. దాదాపు ఆర్‌ఆర్ఆర్ తర్వాత.. ఒక్క సోలో సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాలేదు.
ఈ గ్యాప్ ని ప్రభాస్ బాగా యూజ్ చేసుకొని వరుస సినిమాలో నటిస్తూ పాన్ ఇండియన్ నెంబర్ వన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌కు పోటీగా మన స్టార్ హీరోస్ అందరూ రంగంలోకి దిగుతున్నారు. చివరిగా ఎన్టీఆర్ దేవరతో పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఈ సినిమా.. రికార్డులను త్వరలోనే అల్లు అర్జున్ పుష్ప 2, రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇప్పటికే ఫ్రీ థియెట్రికల్ బిజినెస్‌తో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్.. దేవరని క్రాస్ చేసింది. దేవరకు ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్ల ప్రీ థియెట్రికల్ బిజినెస్ జరిగితే.. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌కు మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.150 కోట్ల ప్రీ థియెట్రికల్ బిజినెస్ జరిగింది.
దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్లు మాత్రమే జరగగా.. కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రెండు సినిమాలకు రూ.40 కోట్ల వ్యత్యాసం వచ్చింది. ఇక గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్ లో రూ.30 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.45 కోట్లు, కర్ణాటకలో రూ.16కోట్లు, తమిళనాడులో రూ.30 కోట్లు ప్రీ థియెట్రికల్ బిజినెస్‌లు జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ సినిమాకు ఇప్పటికే రూ.271 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. అలా దేవర కంటే.. చరణ్ గేమ్ ఛేంజర్ ఏకంగా రూ.100 కోట్లు అధికంగా చేసింది. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న చరణ్ గేమ్ ఛేంజర్‌పై పాజిటివ్ టాక్ వస్తే.. ఫస్ట్ వీక్ లోనే ఆ బిజినెస్ అంతా రికవరీ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.