అక్కినేని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెను స్టుపిడ్‌గా లవ్ చేసి తప్పు చేశాను అంటూ కామెంట్స్ చేశాడు. ఈ మాటలు విన్న చాలా మంది సమంత గురించి ఆయన మాట్లాడి ఉంటాడని భావించారు. అయితే అది పొరపాటే. ఎందుకంటే నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు మాట్లాడిన మాటలు కాదు. ఒకప్పటి మాటలు. అందరికీ చదువుకునే రోజుల్లో సినిమాల్లోకి రాకముందు లవ్ స్టోరీస్ ఉంటాయి. అలా నాగచైతన్య కూడా తన సినిమాల్లోకి రాకముందు స్కూల్ డేస్ లో, కాలేజీ డేస్ లో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించానని.. వారిద్దరు కూడా తనకు దూరమయ్యారని చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా స్కూల్లో చదువుకున్న టైం లో ఓ అమ్మాయిని ప్రేమించా.. తను స్కూల్ వదిలేసి వెళ్లిన టైం లో బాగా ఏడ్చా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయినని.. లైఫ్ అక్కడితో ఆగిపోయినట్లు అనిపించింది. కెరీర్ పోయినట్లు అనిపించిందని.. ఎప్పుడో తన చిన్నతనంలో పెట్టుకున్న లవ్ ఎఫైర్ గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేశాడు. నేను అప్పుడు ఎంత స్టుపిడ్ గా లవ్ చేసానా అని ఇప్పటికే అనుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే యాంకర్ దీనికి ప్రశ్నిస్తూ.. మీ ప్రేమని వదులుకున్నప్పుడు మీరు బాధపడ్డారా అని అడగగా.. డెఫినెట్‌గా చాలా బాధపడ్డా ఎవరితో అయినా ఓ బాండింగ్ ఏర్పడ్డాక.. దూరమైతే నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతా అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.
అయితే గతంలో నాగచైతన్య మాట్లాడిన వీడియో ఇప్పుడు నెటింట మరోసారి వైరల్ గా మారింది. ఇది కచ్చితంగా సమంత గురించి చేసిన కామెంట్స్ అంటూ.. పలువురు కావాలనే ఆయన కామెంట్స్‌ను తప్పుదారి పట్టిస్తూ వైరల్ చేస్తున్నారు. సమంతతో విడిపోక ముందే నాగచైతన్య ఇంటర్వ్యూలో ఇవి చెప్పుకొచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత దూరమైన టైంలో కూడా చైతూ చాలా రోజులు ఏడ్చారని.. నాగార్జున ఇటీవల ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించాడు.