స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్లో మక్కాం వేసింది. అయితే ఈ అమ్మడు మొదటనుంచి ఫిట్నెస్ఫ్రిక్ అన్న సంగతి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు జిమ్‌లో ఎక్కువగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నడుముకు బెల్ట్ లేకుండా 80 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో ఆమె అనుకున్నది సాధించకపోగా తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. ఇక వెన్న నొప్పి కారణంగా ఈమె గడిచిన ఆరు రోజులుగా మంచం నుంచి క్రిందకు దిగలేని పరిస్థితి ఏర్పడిందట. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ స్వయంగా వివరిస్తూ ఆరు రోజులుగా మంచం పైనే ఉంటున్నా అంటూ వెల్లడించింది. ఒకోసారి శరీరం చెప్పిన మాట వినాలని.. మూర్ఖంగా ఉండకూడదు అంటూ షేర్ చేసుకుంది. నేను చాలా తెలివి తక్కువ పని చేశాను అంటూ వెల్లడించింది.
నా శరీరం చెప్పిన మాట నేను అసలు వినలేదు.. గత ఆరు రోజులుగా మంచం పైనే ఉండాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి మరో వారం పడుతుందట అంటూ వెల్లడించింది. అంతకంటే వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఇక ఇది నేను నేర్చుకున్న పాఠం. దయచేసి మీ శరీరం మీకు సంకేతాలు ఇచ్చినప్పుడే వినండి అంటూ రకుల్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. బాడి కంటే మైండ్ బలమైనదని ఇన్నాళ్లు అనుకున్నా.. కానీ ప్రతిసారి అది నిజమవద్దు. త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తా అంటూ నవ్వుతూ వీడియో ని షేర్ చేసుకుంది.