దేవర ప్రాఫిట్ డీటెయిల్స్ ఇవే.. టాప్ 10 లో ఎన్నో ప్లేస్ అంటే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొర‌టాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీఖాన్ విల‌న్ పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే సినిమా నుంచి దాదాపు రూ.57 కోట్ల లాభాలు వచ్చినట్లు టాక్‌. ఇక దేవర ప్రాఫిట్ డీటెయిల్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గ‌ మారాయి. ఈ క్రమంలోనే భారీ లాభాలను సాధించిన టాప్ 10 టాలీవుడ్ సినిమాల్లో దేవర టాప్ 7లో నిలవడం విశేషం.

Devara - Part 1' soars as 2024's second-highest grosser; eyes for a 300  crore milestone after ...

అలా టాప్ 10 జాబితాలో మొదట బాహుబలి 2, తర్వాత బాహుబలి 1, కల్కి, ఆర్‌ఆర్ఆర్, హనుమాన్, అల వైకుంఠపురం సినిమాలు నిలిచాయి. వీటి తర్వాత ఎక్కువ లాభాలను సంపాదించిన 7వ సినిమాగా దేవర నిలిచింది. దేవర తర్వాత భారీ లాభాలను అందించిన సినిమాగా గీత గోవిందం , ఎఫ్2, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దేవర హైయెస్ట్ కలెక్షన్లు సాధించి లాభాల బాటలో నిలిచిన సినిమాలో టాప్ సెవెన్ ప్లస్ సంపాదించుకోవడం అభిమానుల ఆనందానికి క‌ల్పిస్తుంది.

Devara Hindi Box Office Collections Day 9: Jr NTR, Janhvi Kapoor and Saif  Ali Khan film records slight jump; inches closer to Rs 50 crore mark |  PINKVILLA

ఇక ఇప్పటికీ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఫ్యూచర్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లతో కొత్త రికార్డు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే సినిమా రిలీజై ఇప్పటికే రెండు వారాలు కావడంతో.. భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించడం అంటే అంత సులువు కాదు.. అయినా ఇప్పటివరకు సినిమాపై వచ్చిన లాభాలు.. అలాగే దేవర పుల్ ర‌న్‌ కలెక్షన్ల విషయంలో వచ్చే లాభాలు.. నిర్మాతలకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.