ఒకప్పుడు టాలీవుడ్‌లో లవ్ స్టోరీల ట్రెండ్ తెగ నడిచేది. అప్పట్లో ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా అందుకున్నాయి. అలాంటి సినిమాలు ఇప్పటికీ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్నాయి. వాటిలో సంబరం మూవీ కూడా ఒకటి. దశరథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ 2003లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకున్న ఈ సినిమాలో.. నితిన్ హీరోగా నటించగా నిఖితా హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. సీతా, బెనర్జీ, గిరిబాబు, ఎస్.వి.కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు కీలక పాత్రలో మెప్పించిన ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించాడు.
చిన్నప్పటినుంచి ఓ అమ్మాయి, అబ్బాయి ఇద్దరు స్నేహంగా ఉండడం.. ఈ క్రమంలో హీరో ఆమెను ప్రేమించడం.. ఆ విషయాన్ని తనకు చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. చివరకు హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు.. అనే కథాంశంతో సినిమా రూపొంది ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిఖిత తుక్రాల్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన అందం, అభినంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. తర్వాత తెలుగులో నటించి మెప్పించింది. వేణు హీరోగా నటించిన కళ్యాణ్ రాముడు సినిమా అమ్మడికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది.
టాలీవుడ్‌లో ఈ అమ్మడు నటించింది అతి తక్కువ సినిమాలైనా.. తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న నిఖిత.. పంజాబీ కుటుంబానికి చెందిన ముంబై సోయగం. ఇక 2002లో హాయ్ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తర్వాత తమిళ్, మలయాళం నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాదు.. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో పాత్రలో ఆకట్టుకుంది. కన్నడ బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ లో సెకండ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాగార్జున డాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో నటించిన ఈ అమ్మడు కొంతకాలానికి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది.