టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియ ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ మళ్లీడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కనుంది. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, వికీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచారు మేకర్స్. ఇక తాజాగా విజయదశమి కానుకగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక గతంలో మూవీ నుంచిరిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసింది. అంతకుమించి సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఎగిరే గుర్రంపై నుంచి మెగాస్టార్ చిరంజీవి వచ్చే విజువల్స్ అయితే ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించిన వశిష్ట.. టీజర్లో విజువల్.. 93 సెకండ్లలో స్పష్టంగా చూపించారు. ఇందులో టాప్ లెవెల్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, హై ఆప్టెన్ యాక్షన్ ఎపిసోడ్లు, అద్భుతమైన డ్రామాతో పాటు.. విజువల్ వండర్ కూడా కనిపిస్తుందని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ సినిమాను మొదట సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్‌ను అదే తేదీకి రిలీజ్ చేయాలని మేకర్స్.. చిరుతో పాటు, uv క్రియేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో వారు తమ సినిమాను మరో తేదీకి వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నట్లు దిల్‌రాజు అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆశిక రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్స్ కూనాల్ కపూర్ ఫవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చోట కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ టీజర్‌ను మీరు ఓ లుక్కేసేయండి.