ఇండియన్ క్రికెట్ హిస్టరీ లోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు క్రికెటర్ కపిల్ దేవ్. స్టార్ క్రికెటర్ గా మంచి ఇమేజ్ తో దూసుకుపోయాడు. ఇండియాకి మొట్టమొదటిసారి వరల్డ్ కప్ అందించి.. క్రికెట్ ప్రయాణాన్నే మార్చి కెప్టెన్ గా మారిన ఈయన ఎంతోమంది క్రికెట్ కెరీర్‌ను ఎంచుకోవడానికి ఆదర్శంగా నిలిచాడు. క్రికెట్ రంగంలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్న కపిల్ దేవ్.. 356 అంతర్జాతీయ మ్యాచుల్లో తన ఆటతో సత్తా చాటాడు. 687 వికెట్లతో పాటు.. 9031 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
హర్యానా హరికేన్‌గా గుర్తింపు పొందిన కపిల్.. సౌత్ స్టార్ నటుడు కమలహాసన్ మాజీ భార్య సారికతో ఒకప్పుడు ప్రేమాయణం కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట వివాహం కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ.. తర్వాత పలు కారణాలతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అప్పట్లో వీరిద్దరి బ్రేకప్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికీ వీరు విడిపోవడానికి కారణం ఏంటో మాత్రం బయటకు రాలేదు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సారిక.. కపిల్ దేవ్‌తో బ్రేకప్ తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక తర్వాత కపిల్ దేవ్ కూడా వేరే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
ఇక కమలహాసన్ తో మ్యారేజ్ తర్వాత ఈ జంటకు శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరూ ఆడపిల్లలు జన్మించారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకుని ఇద్దరు కూతుళ్లకు తండ్రైన తర్వాత.. పదహారేళ్ళ కాపురానికి డివర్స్ తో చెక్ పెట్టాడు. సారికతో డివోర్స్ తర్వాత కమల్‌హాసన్ కూడా కోలీవుడ్ నటి గౌతమితో కొన్ని రోజులు లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. తర్వాత వీరికి కూడా బ్రేకప్ అయ్యింది. ఇక సారిక.. కమలహాసన్‌తో విడాకుల తర్వాత ఒంటరి లైఫ్ లీడ్ చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు, కమలహాసన్,, కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్ లో లైఫ్ గడుపుతుంది సారిక.