టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ పరంగా, సినిమాల పరంగా కూడా అదరగొడుతున్న మహేష్.. త్వరలో రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు కళ్ళు కాయలు కాలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సుధీర్ బాబు ఈవెంట్లో మహేష్ బాబు లుక్కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.
సుధీర్ బాబు మాట్లాడుతూ మహేష్ కు షర్ట్ విప్పడం, కండలు పెంచడం లాంటివి ఇష్టం ఉండవని.. సన్నగా ఉండడమే ఆయనకు ఇష్టం.. తన చుట్టూ ఒక చట్టం పెట్టుకుంటారు. కానీ.. రాజమౌళి సినిమా కోసం మాత్రం ఎలాంటి బౌండరీస్ లేకుండా ఆయన చెప్పిన మేకోవర్‌కు మహేష్ సిద్ధమవుతున్నాడు అంటూ సుధీర్ బాబు వివరించాడు. నాకు తెలిసినంతవరకు మహేష్.. జక్కన్నకు సరెండర్ అయిపోయాడు అంటూ వెల్లడించాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ తనకు తాను పరిమితులు విధించుకున్నాడు అంటూ వెల్లడించాడు.
మహేష్ బాబు తన పరిదిని మరింత ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది.. చుట్టూ ఉన్న గోడలను బద్దలు కొట్టాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది అంటూ సుధీర్ బాబు చెప్పుకోచ్చాడు. త్వరలోనే వర్క్ షాప్ ను ప్రారంభించి మహేష్ బాబు ఫైనల్ లుక్ ను డిజైన్ చేస్తారంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. అయితే సుధీర్ బాబు ఈ క్రమంలో చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జక్కన్న – మహేష్ కాంబో మూవీ సట్స్ పైకి రావడం ఆలస్యం అయ్యే కొద్ది అభిమానుల పల్స్ మరింతగా పెరిగిపోతుంది. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా.. సినిమా నుంచి జక్కన్న ఇప్పటికైనా ఏదైనా అప్డేట్ రివీల్ చేస్తాడో.. లేదో.. అంటూ ఎదురు చూస్తున్నారు.