టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్స్ మూవీ మాత్రం ఆర్య. తన సినిమాలనింటిలో ఓ మైల్ స్టోన్ గా ఇది గుర్తుండిపోతుంది. గంగోత్రి మూవీ ఇండస్ట్రీకి పరిచయమైన బన్నీ.. ఆర్య మూవీతో స్టార్ హీరోగా మారాడు. అతని పాపులారిటీ ఒక్కసానిగా విపరీతంగా పెరిగింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందింది.
అప్పట్లో ఈ సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేసింది. బన్నీ స్టైల్, మేనరిజం అన్ని కుర్రాళ్ళను ఫిదా చేశాయి. ఈ సినిమాకు పాటల్లో మరింత ప్లస్. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ చుట్టు కొంతమంది పిల్లలు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అలా ఈ పై ఫోటోలో అల్లు అర్జున్ వెనుక ఉన్న పాప కూడా ఒకటి. అప్పట్లో ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఓ హీరోయిన్. తనెవరో గెస్ చేయగలరా.. అది కాస్త కష్టమే లెండి.. తను మరెవరో కాదు శ్రావ్య.
లవ్ యూ బంగారం తో తెలుగులో నటించిన ఈ అమ్మడు.. కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రావ్య కన్నడలో రోజ్‌తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, అలాగే సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా తెరకెక్కిన నందిని నర్సింగ్ హోమ్ సినిమాలోని హీరోయిన్గా నటించి మెప్పించింది. తమిళ్ లోను పగిరి విలాయెట్టు ఆరంభం సినిమాల్లో నటించింది. అయితే గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఏ చిన్నది..జ సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. తన అందమైన ఫోటోలను షేర్ చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తన లేటెస్ట్ లుక్స్ నెటింట ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి. మీరు ఓ లుక్ వేయ్యండి.