పాన్ ఇండియాలో తెలుగు ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ బ్యానర్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు.. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని టాక్. ఇక ఈ సినిమా రన్ టైం ఒప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దెవర నడివి రెండు గంటల 42 నిమిషాలట.
ఇక సినిమా సెన్సార్ పూర్తయిన తర్వాత మరోసారి సినిమా నుంచి ఐదు నిమిషాల పాటు కట్ చేసుకుంటే.. ఈ మేరకు రన్ టైం వచ్చిందని టాక్ నడుస్తుంది. కానీ.. అమెరికాకు పంపిన ఐమాక్స్ ప్రింట్ ఏకంగా 3 గంటల 10 నిమిషాలు నడివి ఉందని సమాచారం. ఇక్కడ ప్రింట్ కంటే.. అక్కడ ప్రింట్ లెంత్ చాలా ఎక్కువగా ఉందట. ఇక్కడ ఉన్న ప్రింట్, మూవీ రన్ టైం ఎంత.. అక్కడ సినిమా రన్ టైమ్ ఎంత.. అన్నది పక్కన పెడితే.. ఈ సినిమాను ఒకటికి పది సార్లు చూసిన తర్వాత మొత్తం మీద 15 నిమిషాల భాగాన్ని సినిమా నుంచి కట్ చేశారని.. ఫైనల్ అవుట్ ఫుట్ ప్రిపేర్ చేశారని సమాచారం. అయితే సెన్సార్ పూర్తయిన తర్వాత మిగిలిన సినిమాలో నుంచి కట్స్ తీసేసిన తర్వాత రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమాను చూశారట. ఇక కార్తికేయకు సినిమా సెకండాఫ్ బాగా నచ్చేసిందని.. క్లైమాక్స్ 20 నిమిషాలు చాలా బాగుంది.
ముఖ్యంగా షార్క్ ఎపిసోడ్ అయితే హైలెట్ ఉందని.. కథలో కావాలని పెట్టినట్లు కాకుండా నిజంగానే కథలో జరిగినట్లుగా సన్నివేశాన్ని తెరకెక్కించారంటూ కార్తికేయ తన స్నేహితులతో చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. మొత్తానికి టాలీవుడ్‌లో మాత్రం దేవర మానియా విపరీతంగా నడుస్తుంది. ఎక్కడ చూసినా దేవర.. దేవర. సెన్సార్ టాక్ ఏంటి.. సినిమా ఎలా ఉండబోతుంది.. అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక టాలీవుడ్‌కు ఓ పెద్ద సినిమా సక్సెస్ చాలా అవసరం అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేడు గ్రాండ్ లెవెల్లో జరగనుంది. ఈ ఈవెంట్లో రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారట. ఇక ఈ ట్రైలర్ కూడా చూసిన తర్వాత దేవర స్టోరీ పై మరింత క్లారిటీ రానుంది.