హీరోయిన్ సాన్వీ శ్రీవాస్తవ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవీలో కాలంలో అమ్మడు బికినీ ఫోటోలతో నెటింట దుమారం రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ స్పెషల్ ఫొటోస్ ఇంటర్నెట్ను వ్లాస్ట్ చేస్తున్నాయి. ఇంతలోనే అమ్మడుకు సంబంధించిన ఓ షారకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది.
రాపిడ్ రష్మీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో శాన్వి తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ తన హెల్త్.. కెరీర్ను ఎలా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చింది. సాన్వి శ్రీ వాస్తవ.. అండాశయ్య సిస్టుల సమస్యతో ఇబ్బంది పడ్డానని.. తన జీవితాన్ని అది మార్చేసింది అంటూ చెప్పుకొచ్చింది. డిసెంబర్ 8న తన పుట్టినరోజు జరుపుకున్న శాన్వి.. తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డానని.. అదే నన్ను కదలకుండా చేసింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్ళ.. జీవితంలో అంత బాధను ఎప్పుడూ అనుభవించలేదు అంటూ శాన్వి వివరించింది. వైద్యులు సోనోగ్రఫీ పరీక్ష చేసి ఫలితాలు కాస్త తేడాగా ఉన్నాయి.. ఎమ్మారై, క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారని.. అందులో రోగనిద్దారణ నా అండాశయాలలో బహుళ సిస్టులు ఉన్నట్లు వెల్లడయింది.
నేనే ఆశ్చర్యపోయా, భయపడ్డా, ప్రత్యేకించి డాక్టర్ తొలగించే అవకాశం గురించి ప్రస్తావించినప్పుడు నిజంగానే బాధనిపించింది. టెస్ట్ లో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో నేను నరకం అనుభవించా అంటూ చెప్పుకొచ్చింది. అండాశయాలు పోతాయని భయం ఎక్కువైందని.. నా పుట్టినరోజు తర్వాత ఒక్కరోజులోనే నేను ఇంత తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని.. అదృష్టవశాత్తు టెస్ట్ రిజల్ట్స్ వెంటనే అత్యవసరా శస్త్రచికిత్సని సూచించలేదంటూ చెప్పుకొచ్చింది. అయినా నాకు యాంటిబయోటిక్స్ ఎక్కువగా ఉపయోగించారని.. చాలా నెలలు మందులు తీసుకోవాల్సి వచ్చిందంటూ వివరించింది. మందులు సైడ్ ఎఫెక్ట్స్ నొప్పించాయి. శారీరక, మానసిక భారాన్ని మరింతగా పెంచేశాయి.. ఆ అనుభవం మర్చిపోలేనిది అంటూ షేర్ చేసుకుంది.