పెళ్లి పీటలెక్కిన టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్.. హాజరైన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీకృష్ణ ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీ డైరెక్టర్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వచ్చేస్తారు. స్టువర్ట్ పురం పేరు మోసిన గజదొంగ.. టైగర్ నాగేశ్వరరావు జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తేజ్ నారాయణ అగర్వాల్ ప్రొడక్షన్‌లో అభిషేక అగర్వాల్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది.

అయితే ఊహించిన రేంజ్ లో సినిమా సక్సెస్ అందుకోలేదు. వంశీకృష్ణ ఈ సినిమా కంటే ముందు దొంగాట సినిమాకు దర్శకుడుగా వివరించాడు. ఇందులో అడవి శేష్‌, లక్ష్మీ మంచు కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలతో పాటు రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, మంచు లక్ష్మి మిసెస్‌. సుబ్బలక్ష్మి సినిమాలకు కూడా దర్శకుడుగా వ్యవహరించాడు. ఇక తాజాగా డైరెక్ట్ వంశీకృష్ణ పెళ్లి పీటలెక్కారు. ప్రమీల అనే యువతీని వంశీకృష్ణ వివాహం చేసుకున్నారు.

బుధవారం ఈ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగినట్లు సమాచారం. ఇక ఈ పెళ్లికి ఎంతోమంది సెలబ్రిటీస్ వచ్చి సందడి చేశారు. వారిలోనే ప్రముఖ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కూడా హాజరై సందడి చేశారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈక్ర‌మంలో ఫోటిస్‌ చూసిన జనమంతై కొత్త జంటకు తమ విషెస్ తెలియజేస్తున్నారు.