బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో సందడి చేయనున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్ళే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ళు ఎన్నో అద్భుతమైన సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఈయన.. సినీ కెరీర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్‌ హోటల్‌లో గ్రాండ్ లెవెల్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు.

Southern Indian celebrities invited for Balakrishna's Golden Jubilee event

తెలుగు సినీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌ల‌కు తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ హాజ‌రై సందడి చేయనున్నారు. కోలివుడ్‌ ఇండస్ట్రీ నుంచి హీరో శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కిచు సుదీప్, దునియా విజయ్.. అలాగే కోలీవుడ్ డైరెక్టర్ పి.వాసు, న‌టుడు నాజర్.. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, హీరోయిన్స్‌.. సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలత ఇలా ఎంతో మంది సందడి చేయనున్నారు. అలాగే ఎస్ఐ ఎఫ్ సి సి మరియు ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్ రవి కొతార్కర్, కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ ,సెక్రెటరీ హరీష్ ఇలా ఎంతోమంది ఈవెంట్లు పాల్గొననున్నారు.

A grand curtain raiser program of Nandamuri Balakrishna Golden Jubilee  celebrations

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ హానోరబుల్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ మరియు సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఈవెంట్ కు తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున ప్రముఖులను ఆహ్వానించారు. ఇక ఇప్పటికే ఈ వేడుకల గురించి ఆడియన్స్‌కు తెలియడంతో.. టాలీవుడ్ నుంచి ఎంతమంది ప్రముఖులు హాజరవుతున్నారు. అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ ఈవెంట్లో పాల్గొనే సందడి చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా వేడుక‌ల‌కు రానుంద‌ట‌. ఇక‌ జూనియర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌ ఈ వేడుకలకు వ‌స్తాడా.. లేదా.. అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు.. ప్రముఖ డైరెక్టర్స్ అంతా కూడా ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు.