పోకిరి సినిమా లేడి విలన్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్‌లోనే ఎంత స్పెషల్ సినిమాలలో పోకిరి ఒకటి. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచిన‌ ఈ సినిమాలో.. మహేష్ అప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు, ఎక్కడ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ముందు మహేష్ బాబును ఓ స్ట్రీట్‌ రౌడీలా చూపించి.. చివర్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రివీల్‌చేసి షాక్ ఇచ్చారు.

Jyothi Rana : పోకిరీ.. లేడీ విల‌న్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…? చివ‌ర‌కి  ఇలా..

క్లైమాక్స్‌లో మహేష్ బాబు ఇచ్చిన ఎలివేషన్స్‌కు అప్పట్లో థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో విలన్ గా ప్రకాష్ రాజ్ ఆట్టుకున్నాడు. ఇక ఈ విల‌న్‌ గ్యాంగ్ లో లెడీవిల‌న్ గా నటించిన ఈ పై ఫోటోలో అమ్మ‌డు గుర్తుందా..? మహేష్ బాబు పై మోజు పడిన ఓ నెగిటివ్ పాత్రలో అమ్మడు మెరిసింది. పాత్ర న‌డివి కొంతసేపే అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.. ఆమె జ్యోతి రానా. పేరు చెప్తే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. పై ఫోటో చూస్తే ఆమె ఎవరో ఐడియా వచ్చేస్తుంది. ఇక అప్పట్లో పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జ్యోతి రానా తర్వాత అడపా దడప సినిమాల్లో నటించింది.

Karar The Deal Heroine Jyothi Rana, who was seen in the role of Mona in  Mahesh Babu and Puri Jagannadh's 'Pokiri - Entered Bollywood to nice debut

 

పోకిరి తర్వాత దేవుడు చేసిన మనుషులు, మోహన్ బాబు సినిమాల్లో మెరిసింది. అయితే తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో.. తెలుగులో కనిపించలేదు. ఇక బాలీవుడ్ లోను కొన్ని సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు జ్యోతి రానా ఎలా ఉంది.. అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె గురించి నెటింట‌ తెగ సెర్చింగ్ మొదలైపోయాయి. ఇక ఈ అమ్మ‌డు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. అలా అమ్మడి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ అమ్మడి తాజా లుక్స్ చూసిన నెటిజ‌న్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఈమె పోకిరిలో కనిపించి అన్ని ఏళ్లు గ‌డిచిన‌ ఇప్పటికీ అదే స్ట్రక్చర్ మైంటైన్ చేస్తూ.. అంతే ఫిట్నెస్ తో ఎలా ఉంది అంటూ షాక్ అవుతున్నారు.