సమంత ఓ నిరక్షరాస్యురాలు.. ది లివర్ డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో హెల్త్‌ఫోడ్‌కాస్ట్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో భాగంగా స‌మంత షేర్ చేసిన ఓ పోస్ట్ నెటింట చర్చనీయాంసంగా మారింది. నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోపారాక్సైడ్ కలిపి నెబిలైజ్ చేయండి అంటూ ఓ సలహానిస్తూ తన ఇన్స్టాలో పోస్ట్‌ షేర్ చేసుకుంది. దీనిపై ఓ లివర్ డాక్టర్ స్పందించాడు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని మరోటి ఉండదు అంటూ చెప్పిన ఆయ‌న‌ హైడ్రోపరాక్సైడ్ ఒక అన్‌స్టేబుల్ కెమికల్ అని.. ఇది నీరు మరియు ఆక్సిజన్ గా మారుతుంది అంటూ వివరించాడు.

Samantha Gets Called Out By Doctor For Health Advice! | Samantha Gets Called Out By Doctor For Health Advice!

అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరిమాణవులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ పనిచేస్తాయి. అవి అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న శరీరంలోని ఊపిరితిత్తుల భాగాన్ని.. లోపలి పల్చ‌నిపొరని బాగా దెబ్బతీస్తాయని.. దీంతో న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌ లాంటి వాటికి దారితీస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వస్తే వారి ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం చావు త‌ప్పదు.. ఇక మీ ఇష్టం అంటూ ఆయన హెచ్చరించాడు.

ఈ పోస్ట్‌ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తాడు. అయితే సమంత ఇన్‌స్టా చెక్ చేస్తే.. ఆమె షేర్ చేసిన స్టోరీస్ లో ఈ విషయం నిజంగానే ప్రస్తావించింది. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఆమె షేర్ చేసుకుంది. ఆ పోస్ట్ పైన స్పందిస్తూ దా లివర్ డక్ అనే ట్విట్టర్ పేజీ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ నెబిలైజేషన్ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని చెప్పాడు. దీంతో పాటే సమంత ఒక హెల్త్ అండ్ సైన్స్ నిరక్షరాస్యురాలు అంటూ వెల్ల‌డించాడు. ప్రస్తుతం ఆ డాక్టర్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.