అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అసలు అడగొద్దు.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్.. !

కమల్ హాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా భారీ పాపులరిటీతో దూసుకుపోతుంది శృతిహాసన్. మొదటి చిన్న చిన్న సినిమాల్లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. సింగింగ్, డ్యాన్సింగ్, నటన, అందంతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌత్ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. చివరిగా సలార్‌ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన ఇన్స్టా వేదికగా ఫాలోవర్స్‌తో చిట్ చాట్ నిర్వహించింది.

ఈ ముద్దుగుమ్మ ఇందులో భాగంగా ప్రేమకు అర్థం చెబుతూ అది ఒక అద్భుతమైన భావం అంటూ వివరించింది. మన జీవితాన్ని నడిపించేది ప్రేమేనని.. ప్రతి ఒక్కరు తముచేసే పనిని ప్రేమించాలంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి కొందరు ప్రశ్నించడం పై అసహనం వ్యక్తం చేసిన శృతిహాసన్.. ఓ నెటిజన్ మీకు పెళ్లెప్పుడు అని అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.. నేను చేసుకోను సార్ అని రిప్లై ఇచ్చింది. మీకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారని మరో అభిమాని ప్రశ్నించడంతో.. ఇది 2024 అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలు అడగడం ఇకనైనా ఆపేయండి ఇవి చాలా సిల్లీగా అనిపిస్తున్నాయంటూ వివరించింది.

అమ్మాయిలకు ఏది సంతోషాన్ని ఇస్తుందో.. ఆ పని వాళ్ళని చేసుకొనివ్వండి అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే గ‌తంలో కూడా తనను రిలేషన్ షిప్ కి సంబంధించిన ప్రశ్నలు అడగొద్దని శృతి విజ్ఞప్తి చేసిన క్రమంలో.. మీరు సింగిలా.. రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజ‌న్ ప్రశ్నించాడు. దీంతో తనకు ఆ తరహా ప్రశ్నలు నచ్చమంటూనే.. సింగిల్ అని క్లారిటీ ఇచ్చేసింది శృతిహాసన్. ఇక ప్రస్తుతం శృతిహాసన్ సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ తోను ఆకట్టుకుంటుంది. దర్శకుడు లోకేష్ కనకరాజు తో ఆమె తాజాగా చేసిన ” ఎనిమోల్ ” స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది. అలాగే డెకాయిట్, చెన్నై స్టోరీ సినిమాలోని నటిస్తోంది. సలార్ 2లోను ఈమె సందడి చేయనుంది.