వాట్.. వార్ 2లో తారక్ పాత్రను ఆ టాలీవుడ్ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీతో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్. తను నటించిన ప్రతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు తారక్.

NTR joins sets of War 2, shoots scenes with Hrithik Roshan | Latest Telugu  cinema news | Movie reviews | OTT Updates, OTT

అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వార్ 2 సినిమాను కూడా ఇటీవల తారక్‌ సెట్స్ పైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మ‌రో సినిమాకు కూడా గ్రీన్ సినిమాలు ఇచ్చేసాడు. ఇక ప్ర‌స్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న వార్ 2 సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్ర కోసం నటిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ క్యారెక్టర్ లో నటించేందుకు ప్రభాస్ ను అప్లోడ్ అయ్యారట మేకర్స్.

 

కానీ ప్రభాస్ ఆ పాత్రను రిజెక్ట్ చేశాడట‌. రూ.100 కోట్లు కాదు కదా ఎన్ని కోట్లు ఇస్తానన్నా సరే ఇలాంటి పాత్రలో నేను నటించ‌న‌ని తేల్చి చెప్పేశాడట. ఈ క్రమంలో అదే రేంజ్ లో ఉండే ఓ టాలీవుడ్ స్టార్ హీరో కోసం వెతుకుతూ ఎన్టీఆర్ వద్దకు వెళ్లారట మేకర్స్. క‌థ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాల్లో ఓ పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తారక్ కనిపించనున్నాడు. ఈ క్రమంలో పార్ట్ 2 పై పాన్ ఇండియా లెవెల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.