కల్కి వీకెండ్ కలెక్షన్స్.. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాడంటే..?

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల జోరుని కొనసాగిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం వసూళ్ళ‌ సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ ద‌త్త్ ప్రొడ్యూస‌ర్‌గా ఇప్పటివరకు ఏ తెలుగుసినిమాకు లేనంత‌ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. రూ. 700 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను నాగ అశ్విన్ మైథ‌లాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది.

Kalki 2898 AD 1st Weekend(4 Days) Total World Wide Collections!! : T2BLive

ఫ‌స్ట్ డే రూ.190కోట్లు క‌లెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు రూ.58 కోట్ల వసూళ‌ను సంపాదించింది. మూడో రోజు రూ.64.5 కోట్లు గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొటింది. మొత్తంగా మూడు రోజుల్లో రూ.204 కోట్ల కలెక్షన్లను రాబట్టిన క‌ల్కి.. ఇక నాలుగో రోజు తెలుగు, తమిళ, హిందీ, కర్నాటక, మలయాళ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టి ప్ర‌భాస్ ర్యాంపేజ్ చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు వివరించాయి. తెలుగులో రూ.39 కోట్లు, తమిళ్లో రూ.5.5 కోట్లు, హిందీలో రూ.39 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు మలయాళం లో రూ.3 కోట్లు ఇలా దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Kalki 2898 AD' box office collection day 4: Prabhas' film crosses Rs 500  crore worldwide, Rajinikanth gives thumbs up - BusinessToday

ఇక ఓవర్సీస్ లో కల్కి రామ్ పేజ్ వేరే లెవెల్ లో ఉంది. అమెరికా, కెనడాలో 11 మిలియన్ అంటే రూ.92 కోట్లు.. యూకేలో 900 కే పౌండ్స్‌ అంటే రూ.10 కోట్ల వరకు వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1.6 మిలియన్ డాలర్లు అంటే రూ.9 కోట్లు, న్యూజిలాండ్ లో కోటి, జర్మనీలో రూ.1.3 కోట్ల క‌లెక్ష‌న్‌లు కొల్లగొట్టి దూసుకుపోతుంది. మొత్తంగా ఓవర్సీస్ లో రూ.112 కోట్ల వసూళ్లను తగ్గించుకున్న కల్కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలిపి రూ.550 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకుంది. ఇక‌ ఐదవ రోజు కలెక్షన్లతో ఈ సినిమా రూ.600 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని శనివర్గాలు చెప్తున్నాయి.