‘ కల్కి 2 ‘ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుట్‌.. వామ్మో నాగ్ అశ్విన్ నీ ఇంట‌ర్నేష‌నల్ బ్రెయిన్ ఏంద‌య్యా..?

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క‌లెక్ష‌న్‌ల‌ వర్షం కురిపిస్తున్న కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి బ్లాక్ బ‌స్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రెండో భాగం ఉందని మేకర్స్ క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ కల్కి యూనివర్స్ లో సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే 60% పూర్తయిందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్లారిటీ త్వరలోనే వస్తుందని.. వ‌చ్చే ఏడాదిక‌ల్లా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇక అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశ పట్టాన్ని ఇలాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏ రేంజ్ లో హైప్‌ క్రియేట్ చేసిందో.. అదే రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయి మంచి సక్సెస్ అందుకుంటు దూసుకుపోతుంది. మూడు రోజులుగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతున్న కల్కి సినిమా సెకండ్ పార్ట్ కోసం ఈసారి ప్రేక్షకులు మరింత కనెక్ట్ అయ్యేలా ఇంటర్నేషనల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన రివ్యూలలో అన్ని క్యాటగిరీలకు ప్రేక్షకుల్లో మంచి రివ్యూలు వచ్చాయి. అయితే మ్యూజిక్ విషయంలోనే కాస్త నెగటివ్ రివ్యూలు వినిపించిన సంగతి తెలిసిందే.

MM Keeravani's mother is no more - Telugu News - IndiaGlitz.com

దీంతో కల్కి పార్ట్ 2 కోసం సంతోష్ నారాయణ్ ప్లేసులో ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట అశ్విన్. ఆ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు ఆస్కార్ అవార్డ్‌ గ్రహీత కీరవాణి. ఈ సినిమాకు కీరవాణి వర్క్ చేస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం బిజీగా గడుపుతున్న కీరవాణి ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే కల్కి 2 బాధ్యతలు తీసుకుంటానని వివరించార‌ని టాక్ నడుస్తుంది. జక్కన్న ప్రాజెక్ట్ అంటే దాదాపు మూడు, నాలుగు ఏళ్ళు అన్న పట్టే అవకాశం ఉంది. దీంతో కీరవాణి ముందు కల్కి సినిమాకు సంగీతం సమకూర్చందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో.. లేదో.. అనే చర్చ నెటింట వైరల్ గా మారింది.