మంచు డాక్టర్ లక్ష్మీ ప్రస్తుతం తన మక్కాం ముంబైకి మార్చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు మొదట అమెరికాలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అక్కడ కొన్ని టెలివిషన్ షోలను చేసినా మంచు లక్ష్మి.. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. అలాగే ఒకటి, రెండు హాలీవుడ్ సినిమాల్లోనే మెప్పించింది. సడన్గా యూఎస్ వదిలేసి ఇండియాకు వచ్చేసినా ఈ ముద్దుగుమ్మ.. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గెస్ట్రోల్స్ ను ప్లే చేస్తూ కొద్దికాలం బిజీగా గడిసింది. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయినా అమ్మడికి ఊహించిన సక్సెస్ దక్కలేదు. ఏ ఒక్క రంగంలోనూ తనకు అసలు కలిసి రాలేదు.
దానికి తోడు తన బిహేవియర్ మాట తీరుతో ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటూ వస్తుంది. కానీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదు. ట్రోల్స్ పని లేని వాళ్ళు చేసే చర్యలు అని కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు ఎటువంటి ప్లానింగ్ లేకుండా ముంబైకి మఖం మార్చేసింది మంచు లక్ష్మి. టాలీవుడ్ లో సక్సెస్ కాకపోయినా.. బాలీవుడ్ లో ఏదో ఒకటి సాధించాలనుకుంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ అమ్మడు షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. రహస్యంగా ఆమె కొన్నాళ్లు పాటు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నానని.. ముంబైకి వచ్చిన కొత్తలో ఆమె ఇల్లు అద్దెకు తీసుకోలేదని వివరించింది.
ఇక్కడే ముంబైలో ఉన్న చరణ్ ఇంట్లో నేను ఉన్నానని.. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చరణ్ ని రిక్వెస్ట్ చేశాను అంటూ వివరించింది. దానికి కారణం నేను.. చరణ్ గెస్ట్ అని తెలిస్తే ఎవరు సహాయం చేయరు. రామ్ చరణ్ మీకు తెలిసినప్పుడు మా అవసరం ఏముంటుంది అని అడుగుతారు. అందుకే చరణ్ ని తన ఇంట్లో ఉంటున్న విషయం బయట పెట్టొద్దని కోరా అంటూ చెప్పుకొచ్చింది. నేను ఎందుకు చెప్తాను.. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడే ఉండు అని చరణట్ అన్నాడని వివరించింది. చరణ్‌తో ఎవ్వరికీ చెప్పవద్దని చెప్పి నేనే ఇప్పుడు మీకు చెప్పేస అంటూ నవ్వేసింది. రాణా, రాంచరణ్, మంచు లక్ష్మి చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. వీరు మంచి స్నేహితులు కూడా.. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే చరణ్ తన ఇంట్లో ఆమెకు చోటు ఇచ్చాడు. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబైలో లగ్జరీ హౌస్ రెంట్ కి తీసుకొని లైఫ్ లీడ్ చేస్తుంది.