ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశముదురు బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక… ఎలాంటి పాత్రలో నటించి మెప్పించిందో అందరికీ తెలుసు.. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ అంటూ ట్యాగ్ కూడా చేయించుకుంది .
కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఏకంగా స్టార్ హీరోయిన్ అంటూ పిలిపించుకుంది. అభిమానుల చేత గుడి కూడా కట్టించుకుంది . ఈ మధ్యకాలంలోనే బాయ్ ఫ్రెండ్ సోహెల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తుంది . కాగా రీసెంట్ గా ఒక షో కి జడ్జిగా కూడా మారింది . కాగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుంది హన్సిక .
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తేజ సినిమాలో హన్సిక అక్క పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ తమిళ్ ఇండస్ట్రీలో సిస్టర్ రోల్ లో కనిపించింది కానీ ఒక బడా స్టార్ హీరోకి.. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక యంగ్ హీరోకి అక్క రోల్ లో నటించబోతుంది . ప్రజెంట్ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . కొందరు పెళ్లయిపోగానే ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!