కల్కి సినిమా ఆ స్టార్ హీరోలు అందరికీ బుద్ధి తెచ్చేలా చేసిందా..? ఇప్పటికైనా మేలుకోండి రా బాబులు..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు పలువురు స్టార్ హీరో ఫ్యాన్స్ కి డైరెక్ట్గా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోస్ కి సజెషన్స్ కూడా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో జనాలు. కల్కి సినిమా చూసిన తర్వాత ఇప్పుడు పలువురు స్టార్ హీరోలకి డైరెక్టర్లకి నాగ్ అశ్వీన్ చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేస్తున్నారు స్టార్ మేకర్స్ . ఆ విషయం అందరికీ తెలిసిందే .

ప్రమోషన్స్ కోసం మిగతా స్టార్స్ ని పిలిపించి హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు . ఒక్కొక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 50-60 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే పరిస్థితి ఎంతలా మారిపోయిందో సినిమా ఇండస్ట్రీలో అర్థం చేసుకోవచ్చు . అయితే నాగ్ అశ్వీన్ మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా ప్రవర్తించాడు. కల్కి సినిమాకి ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు.. బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఈవెంట్ చేశారు . ఆఫ్ కోర్స్ దానికి కూడా కోట్లు ఖర్చు అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది .

కానీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఈవెంట్ కి ఎక్కువగా మనీ ఖర్చు చేయలేదు ..వేస్ట్ చేయలేదు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోస్ సినిమా ప్రమోషన్స్ పై కన్నా కూడా కథా కంటెంట్ పై ఫోకస్ చేయండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కల్కి సినిమా విషయంలో ప్రభాస్ – నాగ్ అశ్వీన్ తీసుకున్న డెసిషన్స్ చాలా చాలా బెటర్ గా మారాయి అని కంటెంట్ ఉంటే ఎటువంటి సినిమా అయినా సరే ప్రమోషన్స్ లేకపోయినా హిట్ అవుతుంది అని …మిగతా హీరోలు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని కూసింత ఘాటు పద్ధతి లోనే సజెషన్స్ ఇస్తున్నారు..!