గతంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం తెలియాలన్నా మెయిన్ మీడియాలో వార్త వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఏ విషయమైనా సోషల్ మీడియా పుణ్యమాంట క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అలాగే సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వెంటనే తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఏదైనా విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవాలంటే క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని పంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా కారణంగా కొన్ని లేనిపోని తలనొప్పులు కూడా హీరో, హీరోయిన్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హీరోయిన్లపై ఫ్యాన్ ఫాలోవర్స్ కన్ను ఉండనే ఉంటుంది. హీరోయిన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోల నుంచి హాట్ ఫోటోల వరకు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉంటారు.
అలా ప్రస్తుతం ఓ టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఫోటో నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ అమ్మడిని అభిమానులు ముద్దుగా జూనియర్ ఆర్తి అగర్వాల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పటి యూత్ డ్రీమ్ గర్ల్. చేసింది అతి తక్కువ సినిమాలే ఆయన విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటన, దానికి మించిన డ్యాన్స్ తో కుర్రాళను మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పటికైనా ఈ అమ్మడు ఎవరో అర్థమైందా..? ఆమె మరెవరో కాదు పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీ లీల. మొదటి సినిమాతో ఊహించిన సక్సెస్ అందకపోయినా.. నటనకు మాత్రం మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. తర్వాత రవితేజ ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రమంలో అమ్మడికి సీనీయర్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు కొట్టేసింది. మహేష్ బాబు, బాలకృష్ణ, పవర్ స్టార్ లాంటి స్టార్ హీరోల సినిమాల అవకాశాలను దక్కించుకుని ఒక్కసారిగా సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. అయితే బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి తప్ప మిగతా సినిమాలన్నీ వరుస ఫ్లాప్‌లను ఎదుర్కోవడంతో అమ్మడి క్రేజ్ కాస్త తగ్గింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. ఈ క్రమంలో పవన్ అభిమానులతో పాటు శ్రీలీల ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో శ్రీ లీలకు హిట్ పడాలని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయి ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.