కల్కి ట్రోలింగ్: అర్జునుడు రోల్ లో ఆ హీరోని తీసుకొని ఉంటే బాగుండేదా..? తప్పు చేసావు నాగి..!

“కల్కి” సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ ఏ విధంగా వినిపిస్తున్నాయో నెగిటివ్ కామెంట్స్ కూడా అదే విధంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్స్ విషయంలో చాలా బిగ్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

మొదటి రోజే సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించారు . కాగా ఈ సినిమాలో అర్జునుడి గెటప్ లో విజయ్ దేవరకొండ ను చూపించాడు నాగ్ అశ్విన్ . అయితే ఆయన లుక్స్ పై చాలా ట్రోలింగ్ జరిగింది . ఇప్పుడు ఆ పాత్రలో విజయ్ దేవరకొండ కాకుండా రామ్ చరణ్ నటించిన బాగుండేది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

విజయ్ దేవరకొండ లుక్స్ అస్సలు అర్జునుడు గెటప్ కి మ్యాచ్ అవ్వలేదు అని .. బహుశా రాంచరణ్ ని పెట్టి ఉంటే సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. దీని పట్ల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ పై మండిపడుతూ ఉండడం గమనార్హం . ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్కలా ఉంటుంది . అందరూ ప్రతి పాత్రకి సెట్ అవ్వలేరు గుర్తుపెట్టుకుంటే మంచిది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!