ఫాహద్ ఫజిల్.. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది పుష్ప పవర్ఫుల్ విలన్. ఈ సినిమా చివరలో పార్టీ లేదా పుష్ప అని హంగామా చేసిన ఫాహద్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. మలయాళంలో పలు సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈయన రీసెంట్గా ఆవేశం మూవీతో మరోసారి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఫాహద్‌కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. తాజాగా ఇతనిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సొమెటోగా కేసును నమోదు చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగింది.. ఆ కేస్‌కు కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మలయాళ నిర్మాతగా ఫాహద్ ఫాజిల్ పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలా ప్రస్తుతం ‘ పింకేలీ ‘ షూటింగ్‌ను అంగమలై లోని ఎర్నాకులం గవర్నమెంట్ హాస్పటల్లో రూపొందిస్తున్నారు. గురువారం రాత్రి అంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఎమర్జెన్సీ రూమ్ లోనూ షూటింగ్ చేయడంతో పాటు.. లోపలికి ఎవరిని అనుమతించకుండా చాలా ఇబ్బంది ఎదుర్కొనేలా చేశారని.. అసలు అత్యావసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి.. బీనాకుమారి సీరియస్ అయ్యింది. 7 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.
ఓవైపు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న క్రమంలో మరోవైపు షూటింగ్ కూడా ఎలా చేస్తారు.. దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారంటూ పలువురు పేషంట్స్ ఆరోపించారు. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం మాత్రం ఆరోపణలను కొట్టివేస్తూ రాత్రి షూటింగ్ కోసం రూ.10వేలు చెల్లించామని వివరించింది. అయితే ఈ మొత్తం పరిహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్ ఫాజిల్ పై కేసు పెట్టారు. దీంతో త్వరలో ఫాహద్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. మరియు వ్యవహారంలో చివరకు ఫాహద్‌కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.