ప్రభాస్ నటించిన ఆ సినిమా వల్ల డిప్రెషన్ కి వెళ్లిన రాజమౌళి.. జక్కన్న ఎమోషనల్ కామెంట్స్..?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా, తెలుగు సినీ ఖ్యాతిని పెంచిన స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరును సంపాదించుకున్నాడు రాజమౌళి. కెరీర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా మారి ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించ‌డం ప్రారంభించాడు. తన మొదటి సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటూ ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తున్నాడు. అయితే ఇండస్ట్రీలో అపజయం అంటూ ఎరగని రాజమౌళి.. ప్రభాస్ తో తెరకే కించిన ఓ సినిమా విషయంలో ఎంతగానో కంగారు పడ్డారని.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని స్వయంగా వివరించాడు. ప్రభాస్ హీరోగా నటించిన క‌ల్కి మూవీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Prabhas opens up about Baahubali 3: 'It's in the hands of SS Rajamouli…' - Hindustan Times

ఈ సినిమా మంచి స‌క్స‌స్ సొంతం చేసుకోవ‌డంతో ప్రభాస్ గత సినిమాలకు సంబంధించిన న్యూస్లు మరింత వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్ నేడు ఈ స్థాయిలో ఉన్నాడంటే మొదట రాజమౌళి ప్రధాన కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈయన బాహుబలి సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడంతో ప్రభాస్ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ స్థాయిలో ప్ర‌భాస్ సక్సెస్ సాధించగలుగుతున్నాడు. అయితే బాహుబలి సినిమా మొదటి భాగం రిలీజ్ అయిన టైంలో రాజమౌళి ఎంతగానో ఆందోళన చెందాడట.. ఆ కంగారులో డిప్రెషన్లకు కూడా వెళ్లిపోయారని స్వయంగా ఆయన చెప్పుకొచ్చాడు. అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలో మొదటిసారి రాజమౌళి అలాంటి సాహసం చేశాడు.

5 Years Of SS Rajamouli's Baahubali: The Beginning - The Film That Gave Rise To An All Time Blockbuster

సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగా కేటాయించడు. పైగా ఉత్తరాది నటినటులు ఎవరు కూడా లేరు. అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందో.. లేదో.. అనే కంగారు రిలీజ్ టైం లో రాజమౌళిలో మొదలైందట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నార్త్‌ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆదరణ లభించడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కంగారు కాస్త సర్దుమనిగిందట. ఇక మొదట్లో కంగారులో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఆయన.. మెల్లమెల్లగా సినిమా కలెక్షన్లు పుంజుకోవడంతో నిర్మాతలు సేఫ్ అవ్వడమే కాదు.. పార్ట్ 2కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ట్విస్ట్‌తో.. సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసిందని.. స్వయంగా జక్కన్న ఓ ఈవెంట్లో వివరించారు.