కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్.. ఆనందంలో అనుష్క ఏం చేసిందో తెలుసా..?

మొదటి నుంచి సోషల్ మీడియాలో అనుష్క ప్రభాస్ లను ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉంటారు జనాలు.. ఆ జంటకు ఉన్న క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ అలాంటిది . వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఆనందపడుతున్నారు . కానీ అది ఎప్పటికి నెరవేరుతుందో ఆ దేవుడికే తెలియాలి. కాగా ఈ సంవత్సరంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. అయితే అది అనుష్కని చేసుకుంటాడా లేకపోతే వేరే ఏ హీరోయిన్ అయినా చేసుకుంటాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది . రీసెంట్ గా కల్కి సినిమాలో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అన ఖాతాలో వేసుకున్నాడు .

ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించేసాడు . సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది . అంతేకాదు మొదటి రోజే ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే. ప్రభాస్ నటించిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అనుష్క స్పెషల్ గా మీట్ అయి మరి ప్రభాస్ కు స్పెషల్గా విష్ చేసిందట . సాధారణంగా అనుష్క చాలా చాలా రేర్ సందర్భాలలోనే ఇలా ప్రభాస్ ని డైరెక్ట్ గా మీట్ అయ్యి ఆపై విష్ చేస్తూ ఉంటుంది .

బిల్లా సినిమా మూమెంట్లో సినిమా హిట్ అయినప్పుడు ఈ విధంగా పర్సనల్గా కలిసి విష్ చేసిన అనుష్క ఆ తర్వాత మిర్చి సినిమా కోసం స్పెషల్ గా మీట్ అయి విష్ చేసింది. ఆ తర్వాత బాహుబలి సినిమా కోసం మాత్రమే వీళ్ళు మీట్ అయ్యారు. సినిమాల పరంగా ఆ తర్వాత వీళ్ళు మీట్ అయిందే లేదు.. కల్కి సినిమా హిట్ అవ్వడంతో స్వయానా అనుష్కని ఇంటికి వెళ్లి మరి విష్ చేసిందట . దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది..!