వారెవ్వా: కల్కి సినిమా హిట్ తో జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన నాగి ..నెక్స్ట్ సినిమా ఏ హీరోతోనో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇన్ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా నాగ్ అశ్వీన్ అంటే ఒక డైరెక్టర్.. ఆయన తెరకెక్కించే సినిమాలు బాగుంటాయి ..చూడొచ్చు ..ఫ్యామిలీ అంతా కలిసి ఎంటర్టైన్ అవ్వచ్చు .. ఇంతవరకే అనుకునేవాళ్ళు . కానీ ఒకే ఒక్క సినిమా ఆయన తలరాతతో పాటు సినిమా చరిత్రనే తిరగరాసేసింది. కల్కి సినిమాతో ప్రభంజనం సృష్టించాడు నాగ్ అశ్వీన్. మహాభారతంలోని కాన్సెప్ట్ ను కలియుగంతానికి ముడి పెడుతూ నేటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి జనాలకు అర్థమయ్యే రీతిలో కల్కి సినిమాను తెరకెక్కించడం హైలైట్ గా మారింది .

ఈ సినిమా మొదటి రోజే 180 కోట్లు కలెక్షన్స్ సాధించింది . ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా నాగ్ అశ్వీన్ పేరు మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే నాగ్ అశ్విన్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు అనే విషయం హైలెట్గా మారింది . కల్కి 2 సినిమా కూడా త్వరలోనే రాబోతుంది . అయితే కల్కి 2 సినిమా కంప్లీట్ అవ్వకముందే ఒక స్టార్ హీరోతో జాక్పాట్ ఛాన్స్ అందుకున్నాడు నాగ్ అశ్వీన్ అనే న్యూస్ వైరల్ అవుతుంది.

ఆయన మరెవరో కాదు రామ్ చరణ్ ..యస్..గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ కల్కి సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి స్వయంగా కాల్ చేసి నాగ్ అశ్వీన్ కు విష్ చేశాడట . అంతేకాదు వీళ్ళ మాటల సందర్భంలో ఒక ప్రాజెక్టు కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇది నిజంగా నాగి కి బిగ్ ఛాన్స్ అనే చెప్పాలి..!!