తిరుమల శ్రీవారిని ద‌ర్శ‌నంలో న‌టి హేమ.. రేవ్ పార్టీ ఇష్యూ పై ఆమె రియాక్షన్ ఏంటంటే..?!

బెంగళూరులో గత నెల 20వ‌ తేదీ జరిగిన రేవ్‌ పార్టీకి టాలీవుడ్ తో పాటు ఏపీ పాలిటిక్స్‌లోను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదటి వరకు ఈ రేవ్ పార్టీ సంఘటన నెటింట‌ తెగ వైరల్ గా మారింది. ఈ సంఘటనలో ఎక్కువగా వినిపించిన పేరు.. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఈ రేవ్ పార్టీలో హేమా డ్రగ్స్ తీసుకుందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే నటి హేమ డ్రగ్స్ తీసుకుందంటూ నిర్ధారణ అయింది. తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రంలో సంచలనగా మారింది.

Actress Hema at Tirumala Sri Venkateswara Temple | Filmyfocus.com

అనంతరం హేమ‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్ట్‌. ఇక ఆ టైంలో రేవ్ పార్టీ వివాదం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక బెయిల్‌తో బయటకు వచ్చిన తర్వాత నటి హేమా మొదటిసారి కెమెరాలకు దొరికింది. ఉదయం తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన హేమ.. మీడియాతో ముచ్చటించింది. కాగా నేడు వెంక‌టేశ్వ‌రుని హేమా దర్శనం చేసుకుని బయటకు వస్తున్న సమయంలో మీడియా ఆమెను అడ్డ‌గించారు.

బెంగళూరు రేవ్​ పార్టీ కేసు - నటి హేమకు బెయిల్ మంజూరు

స్వామివారి దర్శనం బాగా జరిగిందని.. నేను ఇక్కడే పుట్టాను ఆ విషయం అందరికీ తెలుసు.. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా.. నా పుట్టిల్లులా అనిపిస్తూ ఉంటుంది అంటూ హేమా వివరించింది. ఈ క్రమంలో మీడియా రేవ్ పార్టి ఇష్యూ గురించి ప్రశ్నించగా.. దీనిపై రియాక్ట్ అవుతూ ఏమో మీకే తెలియాలి.. మీరే ఎప్పటికప్పుడు వార్తలు రాస్తున్నారు కదా అంటూ సమాధానం ఇచ్చింది. హేమ సమాధానికి మీడియాతో పాటు అక్కడ ఉన్న జనం అంత ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.