నాగ్ అశ్విన్ ఆ ఒక్క పని చేసి ఉంటే .. కల్కి సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ని తుక్కుతుక్కు చేసి ఉండేదా..? జస్ట్ మిస్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . నాగ్ అశ్వీన్ చాలా చాలా టాలెంటెడ్ ..అది అందరికీ తెలిసిందే . కల్కి సినిమాతో ఇంకా కొంతమందికి ఆ విషయం అర్థమైంది. అయితే కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్వీన్ చేసిన ఒకే ఒక్క తప్పు సినిమా కలెక్షన్స్ ని కొంచెం తగ్గించింది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు..

సినిమా కాన్సెప్ట్ బాగుంది .. నటీనటుల ఎంపిక కూడా బాగుంది. కోట్లు ఖర్చు చేశారు ..అది కూడా బాగానే ఉంది ..కానీ సినిమాకి సరైన పబ్లిసిటీ లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు . పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాను అదే స్థాయిలో ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుండేది అంటున్నారు . ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీగా 223 కోట్లతో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉంది.

రెండవ స్థానంలో బాహుబలి సినిమా ఉంది. మూడవ స్థానంలో కల్కి వచ్చింది . అయితే కల్కి 180 కోట్లు సాధించింది ..కొంచెం ప్రమోషన్స్ బాగా చేసుంటే కచ్చితంగా 250 కోట్లు దాటుండేసేదని ..నాగ అశ్వీన్ జస్ట్ క్రేజీ రికార్డ్ ను మిస్ చేసుకున్నాడు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. కల్కి 2898 ఏడి మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆలోచన, మేకింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు.