అప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్.. రెండుసార్లు బిగ్ చాన్స్ మిస్ చేసుకున్న నాగ్ అశ్విన్..!

నాగ్ అశ్వీన్.. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఈ పేరే మారుమ్రోగిపోతుంది . మన తెలుగు డైరెక్టర్ మన తెలుగు వ్యక్తి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నాగ్ అశ్వీన్ అంటే ఒక డైరెక్టర్ గా మాత్రమే చూసేవాళ్ళు .. కానీ ఇప్పుడు డైరెక్టర్గా కాదు ఒక స్టార్ గా ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా చూస్తున్నారు . మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో కంపేర్ చేస్తూ నాగ్ అశ్వీన్ ని ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు . దాని మొత్తానికి కారణం కల్కి సినిమా అని చెప్పాలి.

నాగ్ అశ్వీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కల్కి . ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దిశాపటాని దీపికా పదుకొనేలు హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు ఈ సినిమాలో అమితాబచ్చన్ కమల్ హాసన్ కూడా నటించారు . కాగా ఈ సినిమాలో మిగతా చాలా మంది స్టార్స్ ని చూపించాడు నాగ్ అశ్వీన్.. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిని కొన్ని గ్రాఫిక్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించాలి అంటూ అనుకున్నారట . లాస్ట్ లో అది క్యాన్సిల్ చేసుకున్నారు . రీజన్ ఆయనకే తెలియాలి .

ఇంత పెద్ద సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది . కచ్చితంగా 300 కోట్లు దాటుండేసేది ..అయితే నాగ్ అశ్వీన్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను తన తాత గారి పాత్రలో మహానటి సినిమాలో చూపించాలి అని ఆశపడ్డారట. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్వయాన ఈ పాత్రను రిజెక్ట్ చేశారట . బహుశా ఆ కారణంగానే కృష్ణుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని చూపించలేకపోయి ఉండొచ్చు అన్న కంక్లూషన్ కి వచ్చారు ఫాన్స్ .

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్రను రిజెక్ట్ చేస్తే ఏమి సీనియర్ ఎన్టీ రామారావు గారిని గ్రాఫిక్స్ ద్వారా చూపించొచ్చుగా.. ఈ సినిమాకి కృష్ణుడి పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు. వేరే ఎవరినో పెట్టి ఉండే బదులు ఒక బిగ్ స్టార్ హీరోని లేదా సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించుంటే కథ వేరే లెవెల్ లో ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి రెండుసార్లు గూస్ బంప్స్ మూమెంట్స్ ని మిస్ చేసేసుకున్నాడు నాగ్ అశ్వీన్.. ఫ్యూచర్లో అయినా ఆ ఛాన్స్ వస్తుందేమో చూద్దాం..!!