తల్లితో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ బుడ్డోడు.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ క్రేజీ స్టార్.. ఒకప్పటి రెజ్లింగ్ ఛాంపియన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో తల్లితో కనిపిస్తున్న బుడ్డోడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో న‌టించిన ఈయ‌న‌ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప‌రిచ‌య‌మే. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ తెలుగు తో పాటు తమిళ్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా రాణిస్తున్నాడు. 64 ఏళ్ళ వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. కానీ సినీ రంగంలో అడుగుపెట్టడానికి ముందు అతను రెజ్లింగ్ ఛాంపియన్గా ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు. హీరోయిజం సినిమాలే కాకుండా.. కంటెంట్ నచ్చితే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఈ స్టార్ హీరో.

Bollywood for newcomers, says Mohanlal - India Today

ప్రస్తుతం ఈ స్టార్ హీరో కొడుకు మలయాళ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలతో హీరోగా రాణిస్తున్నాడు. ఇంతకీ మేము ఎవరి గురించి చెబుతున్నాము గెస్ చేయగలరా.. అతను మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. 1970లో తెరనట్టం సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తన స్నేహితులతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కానీ సెన్సార్ ఆలస్యం కావడంతో.. సినిమా థియేటర్లకు ఆలస్యంగా వచ్చింది. కానీ ఈ సినిమా కంటే ముందే 1980లో మంజుల విరంజ పక్క అనే సినిమా రిలీజ్ అయింది.

Mohanlal shares a pic with son Pranav | Malayalam Movie News - Times of India

వెండి తెరపై విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్ తన లుక్ తో ఎంతమంది హృదయాలను గెలుచుకున్నాడు. మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా నాలుగు సినీ నేష‌న‌ల్‌ అవార్డులను దక్కించుకున్నాడు. మలయాళంతో పాటే తమిళ, హిందీ, తెలుగు, కన్నడ సినిమాలోని నటించి మెప్పించాడు. మొదట విలన్ గా కనిపించిన తర్వాత.. హీరోగా , కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మెప్పించాడు. 80,90లో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో మొత్తానికి 350 కి పైగా సినిమాల్లో నటించిన మోహన్ లాల్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలోను కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.