పోయే సంకనాకి పోయే ..ప్రభాస్ పరువు మొత్తం గంగలో కలిసిపోయే.. ఏంట్రా ఏంటి ఈ తలనొప్పి..!

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏ ఆనందం కొంచెం సేపు కూడా నిలవనీయడం లేదు కొంతమంది ఆకతాయిలు . ప్రభాస్ లేక లేక బాహుబలి సినిమా తర్వాత హిట్ కొడితే ఆ హ్యాపీనెస్ ని పట్టుమంటే 2 రోజులు కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు . బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియాలో పెరిగిపోయింది . అయితే ప్రభాస్ నటించిన ప్రతి సినిమాకు కోట్లల్లో కలెక్షన్స్ రావాలి అంటే రావు ..ప్రతి సినిమా బాహుబలి రేంజ్ లో హిట్ అవ్వాలి అంటే అవ్వదు.

ఆ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలుసు.. మిగతా హీరో ఫ్యాన్స్ కి తెలియదుగా.. అందుకే సోషల్ మీడియాలో ప్రభాస్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే లేక బాహుబలి తర్వాత కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ అది చూసి జీర్ణించుకోలేని వాళ్లు ప్రభాస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే .

మొదటి రోజే ఏకంగా 180 కోట్లు సాధించింది . దీంతో ఫాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . అయితే తెలుగులో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే సాధించిన మిగతా భాషల్లో మాత్రం డమ్మీ అయిపోయింది. మరీ ముఖ్యంగా తమిళంలో మలయాళం లో అయితే సింగిల్ డిజిట్ నెంబర్ కలెక్షన్స్ సాధించడం దారుణాతి దారుణంగా మారింది . ఇండియాలో రూ.95 కోట్లు రాగా వాటిలో ఒక తెలుగులో రూ. 64.5 కోట్లు వచ్చాయి. అలాగే తమిళంలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 24 కోట్లు, మలయాళంలో రూ. 2.2 కోట్లను కల్కి 2898 ఏడీ సినిమా రాబట్టింది. దీంతో ప్రభాస్ పరువు గంగలో కలిసిపోయే అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!