దరిద్రం అంటే ఇదేగా.. కల్కి సినిమా హిట్ అయిన ఏం లాభం ..? ప్రభాస్ కి ఆ ఆనందమే లేదు..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు . మనకు తెలిసిందే ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 180 కోట్లు సాధించింది. ఇది మామూలు రికార్డు కాదనే చెప్పాలి . అయితే కల్కి సినిమా 180 కోట్లు సాధించి ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన అతిపెద్ద మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది .

దీని పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తూ కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏం లాభం ఆర్ఆర్ఆర్ రికార్డును మాత్రం బీట్ చేయలేకపోయింది గా అంటూ వెగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు . ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 223 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో మొదటి రోజు అన్ని కోట్లు కలెక్ట్ చేసిన బిగ్ ఓపెనర్ మూవీగా టాప్ స్థానంలో ఉంది .

రెండవ స్థానంలో బాహుబలి 217 కోట్లతో సెకండ్ స్ధానం దక్కించుకుంది. అయితే కల్కి ప్రాజెక్ట్ 180 కోట్లు సాధించినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడకుండా చేస్తున్నారు కొంతమంది జనాలు . ఆ విషయంలో ఎన్టీఆర్ – చరణ్ తర్వాతే ప్రభాస్ అంటూ ఓ విధంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి కల్కి సినిమా హిట్ అయిన ఆనందమే లేకుండా పోయింది. ఏంటో ఈ జనాలు..ఇలా తయారైయారు..??