ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా ఫుల్ రివ్యూ బయటకు వచ్చేసింది. సినిమాలోని ప్లస్ ఏంటి ..? సినిమాలోని మైనస్ ఏంటి..? అనే విషయాలు రివ్యూవర్స్ తమదైన స్టైల్ లో చెప్పుకొస్తున్నారు. 80% జనాలు కలిగి సినిమాను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటే 20% జనాలు మాత్రం సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ ని హైలైట్ చేస్తున్నారు .
అయితే ఈ సినిమాకి ప్రధానంగా నెగిటివ్గా మారింది ప్రభాస్ సినిమా నిడివి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ సినిమాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ టైం చాలా తక్కువ అని మాట్లాడుకుంటున్నారు . అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన ఎప్పటికో ప్రభాస్ క్యారెక్టర్ నీ ఇంట్రడ్యూస్ చేయడం కూడా నెగిటివ్గా మారింది అంటున్నారు . సినిమాలో భారీ క్యాస్ట్ అండ్ క్రూ పెట్టడంలో తప్పులేదు ..కానీ హీరోతో పాటు అందరికీ అంతే హైలెట్ అయ్యే రోల్స్ ఇవ్వడం ప్రభాస్ క్యారెక్టర్ ని తక్కువ చేసినట్లుగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .
కొన్ని కొన్ని డైలాగ్స్ బాగున్నప్పటికీ సినిమా కి అవసరం లేని డైలాగ్స్ కూడా ప్రభాస్ చేత నాటిగా చెప్పించాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు . 600 కోట్ల బడ్జెట్ పెట్టిన సరే ఈ సినిమాకి బాహుబలి అంత టాక్ రాకపోవడం గమనార్హం. సినిమా రిలీజ్ అయ్యే వరకు పరిస్థితి వేరేలా ఉండింది సినిమా రిలీజ్ అయిన తర్వాత టోటల్ కధ మారిపోయింది .. పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అంటూ మాట్లాడుకుంటున్నారు ఫాన్స్..!!