సోషల్ మీడియాలో .. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వినిపిస్తూ ట్రెండ్ అవుతున్న పేరు కల్కి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా పేరు బాగానే ట్రెండ్ అయ్యేది .. కానీ ఇప్పుడు కొన్ని పాజిటివ్ కామెంట్స్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ తో బాగా ట్రోలింగ్ కూడా గురవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది .
ఎంతలా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే స్కూల్ కి కాలేజీకి డుమ్మా కొట్టి మరి సినిమా చూడటానికి వెళ్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సిక్ లీవ్ వేసి మరి ప్రభాస్ కల్కి మూవీకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు . అయితే సినిమా చాలామందికి నచ్చింది .. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కి కొన్ని పాయింట్స్ నచ్చలేదు ..కానీ సినిమాని తెరకెక్కించిన నాగ్ అశ్వీన్ విధానాన్ని మాత్రం బాగా అప్రిషియేట్ చేస్తున్నారు .
అయితే ఈ సినిమాని నాగ్ అశ్వీన్ బాగానే తెరకెక్కించిన ఒకవేళ ఈ కాన్సెప్ట్ రాజమౌళి తెరకెక్కించుంటే ఇంకా ఇంకా హైలైట్ అయ్యుండేది అని కామెంట్స్ చేస్తున్నారు . రాజమౌళి లానే నాగ్ అశ్వీన్ కూడా ట్రై చేశాడు కానీ కొన్ని కొన్ని సీన్స్ విషయంలో గ్రాఫిక్స్ విషయంలో ఆ రేంజ్ లో సాటిస్ఫై చేయలేకపోయాడు అంటున్నారు అభిమానులు . ఒకవేళ ఈ సినిమా గాని రాజమౌళి తెరకెక్కించుంటే కచ్చితంగా 100 బాహుబలి రికార్డును బీట్ చేసి ఉండేది అని మాట్లాడుకుంటున్నారు..!!