“కల్కి” సినిమాలో కనిపించిన ఆ ఐదుగురు స్పెషల్ గెస్ట్లు వీళ్లే.. నాగి సర్ప్రైజ్ అద్దిరిపోయిందిగా..!

కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్వీన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అభిమానులను బాగా సర్ప్రైజ్ చేస్తున్నాయి. మొదటి నుంచి ఈ సినిమాలో చాలామంది స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు ..గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది . ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ – దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు నటిస్తున్నట్లు ముందుగానే తెలిసిపోయింది . అయితే సినిమా చూసిన జనాలు మాత్రం ఓ విషయంలో బాగా సర్ ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారు.

ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాలో కొందరిని గెస్ట్ పాత్రలో చూపించారు నాగ్ అశ్విన్.. వాళ్లని అలా తెరపై చూడగానే ఫ్యాన్స్ అరుపులు కేకలతో దద్దరిల్లిచేశారు . మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ని ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించడం నాగ్ అశ్విన్ విజన్ కు మంచి టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసింది . అంతేకాదు మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ.. అనుదీప్ ..ఫరియా అబ్దుల్లా లాంటి వాళ్లు కూడా ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే మెప్పించారు .

మరీ ముఖ్యంగా తెరపై రామ్ గోఫాల్ వర్మ ని చూడగానే ఓ రేంజ్ లో అరుపులు కేకలు విజిల్స్ వినిపించడం గమనార్హం. నాగ్ అశ్వీన్ ఈ విషయంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా సినీ చరిత్రను తిరగరాయబోతున్నాయో..? భారీ బడ్జేట్ తో భారీ అంచనాలతో భారీ క్యాస్ట్ మడ్ క్రూ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది..!