టాలీవుడ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి సినిమాతో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందక పోయినా.. ననకు మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక కొంతకాలం గ్యాప్ తర్వాత నాగార్జున నా సామిరంగా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తన అందం, అభినాయంతో కుర్రకారకు మరింత దగ్గర అయింది ఈ కన్నడ సోయగం. అయినా అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం అంతంత గానే వస్తున్నాయని చెప్పాలి.
ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్రలు నటిస్తున్న ఈ అమ్మడు.. ఇతర భాషల్లో మాత్రం మంచిగానే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కన్నడలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తమిళ్ లోనూ భారీ జాక్పాట్ ను కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ బ్లాక్ బస్టర్ సర్దార్ కు సీక్వెల్‌గా వస్తున్న సర్దార్ 2. కార్తీ కథానాయకుడుగా తెరకెక్కిన సర్దార్ తమిళనాడులో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపద్యంలో సర్దార్‌కు సీక్వల్ గా సర్దార్ 2ను డైరెక్టర్ పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఆశికా రంగనాధ్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సిద్ధార్థ హీరోగా నటిస్తున్న మిస్‌యూ సినిమాలోని ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఆశిక నటిస్తున్న ఈ అన్ని సినిమాల్లోనూ సక్సెస్ అందుకుంటే అమ్మడికి మరిన్ని క్రేజీ ఆఫర్లు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.