కల్కి సినిమా చూడడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారో తెలుసా.. ఇదేం మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రా మావ..!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కల్కి ఫీవర్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఏ ఇంట చూసినా ..కల్కి సినిమా పేరే మారుమ్రోగిపోతుంది. స్కూల్కి వెళ్లే పిల్లాడి దగ్గర నుంచి లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల వరకు కల్కి సినిమా చూడడానికి రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు . స్కూల్ పిల్లాడు కడుపునొప్పి అంటూ స్కూల్ కి డుమ్మా కొట్టి కల్కి సినిమాని చూడడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటే .. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఏకంగా సిక్ లీవ్ తో సినిమాను చూడడానికి రెడీ అయిపోతున్నారు .

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కల్కి సినిమా చూడడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలామంది రేపు సిక్ లీవ్స్ తీసుకుంటున్నారట . ఒకరు ఇద్దరు కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దాదాపు హైదరాబాదులో ఉన్న బిగ్ బడా కంపెనీస్ లలో దాదాపు 60 – 70 మందికి పైగా ఒక్కొక్క కంపెనీ నుంచి సిక్ లీవ్స్ అప్లై చేస్తున్నారట ఎంప్లాయిస్. దీంతో అసలు మేటర్ ఏంటని ఆరా తీస్తే కల్కి సినిమా కోసమే అన్న విషయం బయటపడింది .

ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . కల్కి సినిమా కోసం ఇలా చేస్తున్నారా..? వాట్ ఈజ్ దిస్ అంటుంటే .. మరికొందరు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . కల్కి కోసం ఏం చేసినా తప్పులేదు ప్రభాస్ అన్న రేంజ్ అలాంటిది అంటూ కల్కి సినిమా పోస్టర్స్ ను ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి కల్కి సినిమాతో చరిత్ర సృష్టించేలానే ఉన్నాడు ప్రభాస్ . చూద్దాం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఒరిజినల్ టాక్ బయటకు వచ్చేస్తుంది..!!