త్రిష టైం బాగోలేదు అని చెప్పడానికి ఇదే ది బెస్ట్ ఎగ్జాంపుల్. త్రిష గురించి ఏదో ఒక వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే వస్తూ ఉంది . కాగా రీసెంట్గా హీరోయిన్ త్రిషకి సంబంధించిన కొన్ని ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా హీరోయిన్ త్రిష విజయ్ దళపతి తో ఉన్న కొన్ని ప్రైవేట్ పిక్స్ నెట్టింత బాగా వైరల్ కావడం ఆమె కెరియర్ కు మైనస్ గా మారింది . ఎప్పటినుంచో త్రిషకు విజయ్ కి మధ్య ఒక అర్థం కాని రిలేషన్షిప్ ఉంది అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది . అయితే రీసెంట్గా త్రిష విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లిఫ్ట్ లో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. దానికి ఒక ఇంగ్లీష్ పాటను కూడా జోడించింది .
అంతవరకు బాగానే ఉంది ఆ ఫోటో వైరల్ అవుతున్న మూమెంట్లో త్రిష విజయ్ కలిసి ఉన్న మరికొన్ని ఫోటోలు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు . చాలా చాలా సందర్భాలలో వీళ్ళిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లారు అంటూ తెలిపేలా కొన్ని ప్రైవేట్ ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు . అవి ఒకప్పటి వే అయినప్పటికీ వీళ్ళ మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ కోలీవుడ్ మీడియాలో మళ్లీ ప్రచారం జరుగుతుంది . ఒక ఫోటోలో త్రిష పక్కనే ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది ..ఆ ఫోటోలోని వ్యక్తి విజయ్ దళపతి అంటున్నారు.. మరొక ఫోటో అయితే ఏకంగా త్రిష కు చాలా క్లోజ్ గా ఉన్న ఫోటో వైరల్ అవుతుంది . దీనితో సోషల్ మీడియాలో మళ్లీ త్రిష పేరు హాట్ గా ట్రెండ్ అవుతుంది.
వీరిద్దరి మధ్య ఇప్పుడు డేటింగ్ జరుగుతుందా ..? అంటూ కోలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటుంది . విజయ్ ఇదివరకే తన ఫ్యాన్ సంగీతాన్ని పెళ్లి చేసుకున్నారు . ఈ మధ్యకాలంలో ఆయన విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగినా.. అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు జనాలు. అయితే త్రిష తో దగ్గరగా ఉన్న ఫొటోస్ మళ్లీ ట్రెండ్ అవుతూ ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇదే మూమెంట్లో గతంలో త్రిష కు సంబంధించిన కొన్ని ఫేక్ ఫోటోలు కూడా లీక్ అయి వైరల్ అయిన పిక్స్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. దీంతో సోషల్ మీడియాలో త్రిష పేరు రచ్చ రంబోలా గా మారిపోయింది..!!