కల్కి సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను ఎక్కువగా చేస్తున్నారు కల్కి టీం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏ రంగంలో చూసిన కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు . అది సాఫ్ట్వేర్ కాదు.. బిజినెస్ మ్యాన్ కాదు ఇతర ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కల్కి సినిమా హిట్ అవుతుందా ..? కల్కి సినిమా కాన్సెప్ట్ ఏంటి ..? ఈ సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడా అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
మరి కొద్ది గంటల్లో కల్కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని తెలియక నాగ్ అశ్వీన్ పేరు ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన సినిమాలను చూస్తే ఒక్క సినిమాలో కూడా రిపీటెడ్ కాన్సెప్ట్ ఉండదు . రాజమౌళి లాంటి డైరెక్టర్ అయిన సరే ఒకానొక సినిమాల విషయంలో కొన్ని కొన్ని సీన్స్ అయ్యే విధంగా ఉండొచ్చేమో కానీ నాగ్ అశ్వీన్ మాత్రం ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా విషయంలో చాలా పకడ్బందీగా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకున్నాడు అని ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు నాగ్ అశ్వీన్ ఓ పక్క ప్లానింగ్ తోనే ముందుకు వెళ్తున్నాడట .. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువ టైం గ్యాప్ తీసుకున్న ఒక్క సినిమాతోనే హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రాజమౌళి స్థానాన్ని ఆయన అందుకోవడానికి బాగా కష్టపడుతున్నారట . కల్కి సినిమా రెండు ట్రైలర్స్ చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమవుతుంది.. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కు ఇలాంటి సినిమా తెరకెక్కించాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు ..కచ్చితంగా ఈ సినిమా విషయంలో బిగ్ రిస్కీ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి . అయితే రాజమౌళి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని తప్పించుకోవడానికి ట్రై చేస్తే గ్ అశ్వీన్ మాత్రం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ను సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటున్నాడు . చూద్దాం మరి కొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ డే .. ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో..?