ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉండడం గమనార్హం . నాగ్ అశ్వీన్ దర్శకతవంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల గురించి పదేపదే మాట్లాడుకుంటున్నారు జనాలు . దానికి కారణం ఇటువంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకు ఏ సినిమా రాకపోవడమే . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .
ముంబై ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు కల్కి టీం . దానికి సంబంధించిన ఇంటర్వ్యు తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నాగ్ అశ్వీన్ సో టాలెంటెడ్ అందుకే సినిమా ఇక మూడు రోజుల్లో రిలీజ్ అనగా ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేశారు . అయితే ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. తన క్యారెక్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాన్ని రివీల్ చేశాడు.
ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా హైలెట్ గా ఉంటుందట . ఈ విషయాన్ని స్వయానా ఆయనే ఒప్పుకున్నాడు . “బాహుబలి సినిమా తర్వాత కామెడీ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే మూవీ అని.. ఈ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని ..కొన్ని సీన్స్ లో నెగిటివ్ యాంగిల్ లో కూడా కనిపిస్తాను అని ..నా డార్లింగ్స్ కి ఈ పాత్ర బాగా నచ్చేస్తుంది అని” చెప్పుకు వచ్చాడు . దీంతో ప్రభాస్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!